విశాఖ జిల్లా సింహాచలం పంచగ్రామాల సమస్యపై కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్ సహా ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యవతి తదితరులు హాజరయ్యారు. సింహాచల దేవస్థానంతో పాటు స్థానికులూ నష్టపోకుండా సమస్యను పరిష్కరించాలని కమిటీ నిర్ణయించింది.
పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కృషి: మంత్రి అవంతి
విశాఖలోని సింహాచలం పంచగ్రామాల సమస్యపై సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధుల కమిటీ భేటీ అయ్యింది. దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని మంత్రి అవంతి తెలిపారు.
panchagramala committee meet in cm camp office
ప్రస్తుతం పంచగ్రామాల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో త్వరితగతిన కేసు పరిష్కరానికి కృషి చేయాలని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని అధికారులు కమిటీకి తెలిపారు.
ఇదీ చదవండి:మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్