Yadadri Temple News : తెలంగాణలోని ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి ఉద్ఘాటన పర్వం కన్నులపండువగా మొదలైంది. నేటి నుంచి ఈనెల 28 వరకు యజ్ఞయాగాదులతో యాదాద్రి మార్మోగనుంది. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగానికి రుత్వికులు శ్రీకారం చుట్టారు. ఆగమశాస్త్రానుసారం పంచకుండాత్మక మహాయాగానికి అంకురార్పణ జరిపారు. బాలాలయంలో అష్టోత్తర శతఘటాభిషేక మహారాజాభిషేకం నిర్వహిస్తున్నారు.
Yadadri Temple Updates : పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం పంచకుండాత్మక మహాయాగం జరుపుతున్నారు. బాలాలయంలోని యాగశాలలో పంచకుండాలు సిద్ధం చేసి క్రతువను ప్రారంభించారు. తొలిరోజు స్వస్తివాచనంతో ప్రారంభమైన యాగం.. ఏడురోజుల పాటు 108 మంది పండితుల చేతుల మీదుగా క్రతువును నిర్వహిస్తారు. ఇవాళ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండజ్యోతి ప్రజ్వలన, వాస్తు ఆరాధనలు జరుపుతారు.