PAN MASALA BAN EXTENDED: రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా సహా పొగాకు ఉత్పత్తులపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా ప్రమాణాల విభాగం కమిషనర్ కాటమనేని భాస్కర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనల మేరకు.. 2021 డిసెంబరు 7వ తేదీ నుంచి ఏడాది పాటు గుట్కా ఉత్పత్తులపై నిషేధం పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. గుట్కా, ఖైనీ, పాన్ మసాలాలు, నమిలే పొగాకు, నికోటిన్ ఉత్పత్తులకు సంబంధించి.. తయారీ, నిల్వ, సరఫరా, రవాణా లాంటి అంశాలపై ఈ నిషేధం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆ నోటిఫికేషన్లో పేర్కొంది.
PAN MASALA BAN: గుట్కా, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై మరో ఏడాది నిషేధం - ఏపీ తాజా వార్తలు
PAN MASALA BAN: రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా సహా పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం మరో సంవత్సరం పాటు నిషేధించింది. దీనికి సంబంధించి తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
PAN MASALA BAN