Bhadradri temple: భద్రాద్రిలో పాల్గుణ పౌర్ణమి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయబద్దంగా ఆలయ అధికారులు శ్రీరామనవమి పనులు ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. చిత్రకూట మండపంలో పసుపుకొమ్ములు దంచే ఉత్సవం, తలంబ్రాలు కలిపే వేడుక నిర్వహించారు. బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు.
ఆలయంలో ఘనంగా వసంతోత్సవం
కుంకుమ, సెంటు కలిపిన పన్నీరును తయారుచేసి, బుక్కాను, గులాములు జోడించి స్వామి వారికి హోలీ పండుగ నిర్వహించారు. అనంతరం భక్తులు ఒకరికి ఒకరు రంగులు పూసుకుని రంగు నీళ్ళు చల్లుకున్నారు.
ఆలయంలో భక్తుల హోలీ వేడుకలు ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు , 10న సీతారాముల కల్యాణం...11న మా పట్టాభిషేక మహోత్సవం జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు భద్రాద్రికి భారీగా భక్తులు తరలివచ్చారు. వేదమంత్రోచ్చరణాల మధ్య డోలోత్సవం కనులపండువగా నిర్వహించారు.
గోటితో ఒలిచిన తలంబ్రాలతో భక్తులు ఇదీ చదవండి:సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్‌స్వామి వివరణ.. ఏమన్నారంటే..?