గత ప్రభుత్వ హయాంలో అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి పూజలు జరిగినప్పుడు... అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదని పైలా సోమినాయుడు ప్రశ్నించారు. జనసేన నేతల విమర్శలను ఆయన తప్పుపట్టారు. సింహాల విగ్రహాల విషయంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయని- ఆలయం గేటు వద్దనే ఎమ్మెల్సీ నివాసం ఉందని - విగ్రహాలు అతని ఇంట్లో ఏమైనా ఉన్నాయా? అనేది దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను కోరుతామన్నారు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు అనవసర రాద్ధాంతం మానాలని కోరారు.
'సింహాల ప్రతిమల మాయంపై అనవసర రాద్ధాంతం మానుకోవాలి' - తెదేపా నేతలపై పైలా సోమి నాయుడు కామెంట్స్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి వెండి రథానికి విగ్రహాల మాయం ఘటనలో రాజకీయ పక్షాల విమర్శలపై దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
paila sominaidu comments on mlc tdp over durga temple