ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేగంగా ప్రాణవాయువు తరలింపులో.. కీలకంగా రైల్వేశాఖ

కరోనా రోగులకు ప్రాణవాయువు అవసరం అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రైల్వేశాఖ విలువైన సేవలందిస్తోంది. ఇతర రాష్ట్రాలనుంచి వేగంగా ఆక్సిజన్​ తరలింపునకు ప్రత్యేకంగా రైళ్లను నడిపి అనేక మంది ప్రాణాలు కాపాడడంలో తనవంతు సాయం అందిస్తోంది.

oxygen express running by railways
వేగంగా ప్రాణవాయువు తరలింపులో కీలకంగా రైల్వేశాఖ

By

Published : May 11, 2021, 9:07 PM IST

కొవిడ్​తో విపత్కర పరిస్ధితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో రోగులకు ప్రాణవాయువు అందించడంలో రైల్వేశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్ల రాకపోకలను విజయవాడ డివిజనల్ మేనేజర్ సహా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రోడ్డు మార్గంలో ఆక్సిజన్ ట్యాంకర్లు రవాణా ఆలస్యమవుతుండటంతో వేగంగా ట్యాంకర్లను గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను ఈ శాఖ చేపట్టింది. దీని కోసం ఒడిశా నుంచి తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోని ఆస్పత్రులకు ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించడంలో రైల్వే శాఖ సహకరిస్తోంది.

దీని కోసం అధికారులు గ్రీన్ ఛానల్​ను ఏర్పాటు చేసి ఎక్కడా అవాంతరాలు ఎదురవకుండా చర్యలు తీసుకుంటున్నారు. 5 ట్యాంకర్ల లోడ్​తో 64.24 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన రైలు అనకాపల్లి, ఎలమంచిలి స్టేషన్ల మీదుగా హైదరాబాద్​కు వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఆక్సిజన్ ట్యాంకర్లతో రెండు రైళ్లు వెళ్లగా.. ప్రస్తుతం నడుస్తున్నది మూడో రైలు.

ABOUT THE AUTHOR

...view details