విశాఖపట్నం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ ట్యాంకర్ తరలిస్తుండగా వాహనం టైరు పగిలి పోయి.. దారిలో నిలిచిపోయింది. గన్నవరంలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద ఈ సంఘటన జరిగింది.
ఏసీపీ విజయ్‌పాల్, సీఐ ఆదేశాల మేరకు.. ఎస్సై దగ్గరుండి వెంటనే మరమ్మతులు చేయించారు. రవాణా శాఖ, నేవీ సిబ్బంది సహాయంతో బాగు చేయించి.. ఆక్సిజన్ ట్యాంకర్‌ను గమ్యస్థానానికి చేర్చారు.