రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. రెండో దశ పోలింగ్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 167 మండలాల్లో పోలింగ్ జరిగింది. వాటిలో 2,786 సర్పంచ్ స్థానాలు, 20,817 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొదటి దశలో మాదిరిగానే రెండో దశలోనూ ఓటర్లు ఓటు వేసేందుకు పోటెత్తారు. మెుత్తం 81.67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.67 శాతం నమోదు కాగా..అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 72.87 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు :
- ప్రకాశం 86.67
- గుంటూరు 85.51
- విశాఖ 84.94
- అనంతపురం 84.65
- కృష్ణా 84.12
- తూర్పుగోదావరి 82.86
- విజయనగరం 82
- పశ్చిమగోదావరి 81.75
- కర్నూలు 80.76
- కడప 80.47
- నెల్లూరు 78.04
- చిత్తూరు 77.2
- శ్రీకాకుళం 72.87