ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 16, 2021, 4:07 PM IST

ETV Bharat / city

సీఎం జగన్​ ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ.. ఆరోగ్య కార్యకర్తల ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వెళ్లిపొమ్మంటూ నోటీసులు ఇవ్వడంపై.. ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హామీని సీఎం జగన్​ నెరవేర్చాలంటూ.. విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన వ్యక్తం చేశారు.

healthcare workers protests in vijayawada
విజయవాడలో ఆరోగ్య కార్యకర్తల ధర్నా

వైకాపా అధికారంలోకి వస్తే ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్​ ఇచ్చిన హామీ అమలు కోరుతూ.. విజయవాడ ధర్నా చౌక్​లో ఆరోగ్య కార్యకర్తలు నిరసనకు దిగారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో 5 నుంచి 20 ఏళ్లుగా పని చేస్తున్న వారిని.. వైఎస్సార్ క్లినిక్​లలో కొనసాగించి, ఉద్యోగ భద్ర కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 1,959 మంది ఉద్యోగులను.. ఈ నెల 31వ తరువాత వెళ్లిపొమ్మని నోటీసులు జారీ చేయడంపై ఆరోగ్య కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజూ వేల మందికి వాక్సినేషన్ ఇస్తున్న సిబ్బందిని పంపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details