సీజేఐగా బాధ్యతలు చేపట్టి.. తొలిసారిగా తెలుగు రాష్ట్రాలకు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణను ప్రముఖులు కలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. రాజ్భవన్లో ఎన్వీ రమణను ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు టి.దశరథరామారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
CJI: సీజేఐని కలిసిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు దశరథరామా రెడ్డి
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా వచ్చిన ఆయనను పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వైద్యుడు టి.దశరథరామారెడ్డి.. సీజేఐని కలిశారు.
cji