తెలంగాణ శాసనమండలిలో రాష్ట్ర గవర్నర్ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మంత్రి మండలి నిర్ణయించింది. ఆ మూడు స్థానాలకు ప్రముఖ ప్రజాగాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, బోగారపు దయానంద్ పేర్లను ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ: ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - telangana Council latest news
తెలంగాణ శాసనమండలిలో నామినేటెడ్ ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌లను మండలికి నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు