ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పరిధిలో ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్‌లు, నిల్వ కేంద్రాలు, డిపోల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందిని ఈ నెలాఖరుతో తొలగించేలా ఆదేశాలు జారీచేశారు. 1,922 మంది రెడ్డి ఎంటర్‌ప్రైజెస్ అనే ఏజెన్సీ పరిధిలో ఉండగా.. మే ఒకటి నుంచి వీరి సేవలు అవసరం లేదంటూ ఏజెన్సీ తొలగింపునకు నోటీసు మంగళవారం జారీ చేశారు. రాష్ట్రంలోని మూడు జోన్లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల బాధ్యత ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో.. ఇకపై పొరుగు సేవల సిబ్బంది, ఏజెన్సీ అవసరం లేదంటూ ఏపీఎండీసీ ఎండీ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. కొత్తగా ఇసుక టెండరు దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అన్ని జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాలు మే ఒకటి నుంచి ఆరంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చూడండి: