దసరా ఉత్సవాల్లో భాగంగా.. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు పర్యాటక శాఖ మరో ముందడుగు వేసింది. గగన విహంగంలో బెజవాడ అందాలను చూసేందుకు వీలుగా హెలిరైడ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆకాశమార్గంలో కృష్ణా నదీ అందాలు, దుర్గమ్మ ఆలయం, పార్కులు, భవానీ ద్వీపం చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.
Heli Ride: దసరాకు 'ఆకాశ వీధి'లో విహరిస్తూ.. విజయవాడ అందాలు చూసేయండి - Heli Ride
దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు విహంగ వీక్షణంలో బెజవాడ అందాలను చూసే అవకాశం వచ్చింది. ఆకాశమార్గంలో కృష్ణ నదీ అందాలు, దుర్గమ్మ ఆలయం, పార్కులు, భవానీ ద్వీపం చూసే అవకాశాన్ని పర్యాటక శాఖ అందుబాటులోకి తెచ్చింది.
Heli Ride
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటంలో భాగంగా బెంగళూరుకు చెందిన తంబై ఎయిర్వేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ్టీ నుంచి ఈ నెల 17 వరకు హెలి రైడ్ సర్వీసులు నగరంలోని మున్సిపల్ మైదానంలో అందుబాటులో ఉంటాయి. సామాన్యులకు సైతం హెలిరైడ్ సర్వీసులు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించామని నిర్వాహకుడు శ్రీకాంత్ అన్నారు.
ఇదీ చదవండి:VIJAYAWADA KANAKADURGA TEMPLE: నేడు గాయత్రీదేవి రూపంలో దర్శనమివ్వనున్న బెజవాడ దుర్గమ్మ
Last Updated : Oct 9, 2021, 8:07 PM IST