ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆన్​లైన్ వ్యభిచార ముఠా గుట్టురట్టు - విశాఖ నేర వార్తలు

విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

Prostitution
Prostitution

By

Published : Dec 5, 2020, 7:34 AM IST

Updated : Dec 5, 2020, 9:28 AM IST

ఆన్​లైన్ వేదికగా విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. విశాఖలోని ఓ హోటల్​కు బాలికను తీసుకొచ్చిన వ్యభిచార ముఠా నిర్వాహకుడికి సంబంధించి... పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం అతడ్ని పట్టుకునేందుకు వెళ్లిన సీఐడీ కానిస్టేబుల్​ను నిందితుడు కారుతో ఢీ కొట్టి పారిపోయాడు.

పోలీసులు వెంబడించి అతడితో పాటు ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఓ హోటల్ యజమాని, అందులో పనిచేసే ఓ వ్యక్తి వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అక్కడ దాడి చేసి ఓ విటుడితో పాటు మహిళను అరెస్ట్ చేశారు. తిరుపతిలోనూ ఓ హోటల్​లో దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Last Updated : Dec 5, 2020, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details