ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Inter admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పెంపు - ఇంటర్‌ ప్రవేశాల గడువు పెంపు

రాష్ట్రంలో ఇంటర్ తొలి దశ ఆన్​లైన్ ప్రవేశాల గడువును పొడగిస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి వెల్లడించింది. ప్రక్రియపై సందేహాలుంటే 1800 274 9868 టోల్‌ ఫ్రీ నంబరును సంప్రదించాలని ఓ ప్రకటనలో సూచించింది.

inter admissions
ఇంటర్‌ ప్రవేశాలు

By

Published : Aug 24, 2021, 7:24 AM IST

ఇంటర్‌ తొలి దశ ఆన్‌లైన్‌ ప్రవేశాల నమోదు గడువును ఈ నెల 27 వరకూ పొడిగిస్తున్నట్లు ఇంటర్‌ విద్యా మండలి వెల్లడించింది. 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చని, విద్యార్థులు, తల్లిదండ్రులకు సందేహాలుంటే 1800 274 9868 టోల్‌ ఫ్రీ నంబరును సంప్రదించాలని సోమవారం ఓ ప్రకటనలో సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50, ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు రూ.100 చెల్లించాలని తెలిపింది.

ఇంటర్‌-2021లో మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పరీక్షలకు హాజరుకావొచ్చని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఒకటి కన్నా ఎక్కువ సబ్జెక్టులున్నా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కళాశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సోమవారం వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details