బల్క్ బుకింగ్‌లో 55 శాతానికిపైగా ఇసుక ఇలాగే దారి మళ్లినట్లు గుర్తించారు. ఇసుక అవసరమైన సామాన్యులకు సాధారణ ఆన్‌లైన్ బుకింగ్, వివిధ నిర్మాణాలు చేసే గుత్తేదారులకు బల్క్ బుకింగ్‌ను... ఏపీఎండీసీ అందుబాటులోకి తెచ్చింది. సామాన్యులకు ఏపీఎండీసీయే లారీల్లో ఇసుకను ఇళ్ల దగ్గరకే తీసుకెళ్లి అందిస్తోంది. తమ దగ్గర లారీలు ఉంటే నిల్వ కేంద్రం నుంచి ఇసుకను తీసుకెళ్లే వెసులుబాటును గుత్తేదారులకు కల్పించారు. ఇదే అదనుగా కొందరు దారి మళ్లించారు. నిల్వ కేంద్రం నుంచి ఇసుక లారీలు బయలుదేరి, గుత్తేదారులు పేర్కొన్న చోట్లకు కాకుండా, ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు 22 లక్షల టన్నుల మేర బల్క్ బుకింగ్‌లకు ఇసుక సరఫరా చేయగా, అందులో 55 శాతానికిపైగా (దాదాపు 13 లక్షల టన్నులని అంచనా) దారి మళ్లినట్లు తేలింది. లారీలకు ఉన్న జీపీఎస్, ఇతర సమాచారాలతో ఈ వివరాలు సేకరించారు. అప్రమత్తమైన అధికారులు బల్క్ బుకింగ్‌ను ఆపేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన వారికే బల్క్ బుకింగ్ ద్వారా ఇసుక సరఫరా చేయాలని భావిస్తున్నారు.
- ప్రతి ట్రిప్పులో రెండు, మూడు టన్నులు