ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆన్​లైన్ తరగతుల కష్టాలు.. నిలిపేయాలని విద్యాశాఖ ఆదేశాలు - విజయవాడలో ఆన్ లైన్ తరగతులకు ఇబ్బందుల వార్తలు

కృష్ణా జిల్లాలోని విజయవాడ సహా పలు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులను ఆరంభించాయి. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించే వారిపై చర్యలు తీసుకుంటామంటూ తాజాగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటితో ఇటు పాఠశాలల నిర్వాహకులు.. అటు తల్లిదండ్రులు ఇప్పటికే విసిగిపోయారు. ఒకవైపు నెట్‌వర్క్‌ సమస్యలు వేధిస్తుండగా.. మరోవైపు విద్యార్థుల హాజరు శాతం సగం కూడా ఉండకపోవటంతో కొనసాగించాలా.. లేక మరేదైనా విధానంలో తరగతులు నిర్వహించాలా.. అనే విషయంపై చాలా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

online classes problems in vijayawada krishna district
ఆన్ లైన్ తరగతులు

By

Published : Jul 5, 2020, 11:44 AM IST

ఒక ఇంటిలో 2 తరగతులు చదివే ఇద్దరు పిల్లలుంటే.. ఇద్దరికీ 2 స్మార్టుఫోన్లు కొనుగోలు చేయాలి. వాటికి వేర్వేరుగా ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఉండాలి. ఒక ఫోన్‌ ఉంటే.. ఒక పిల్లాడికి మాత్రమే తరగతులు వినేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థికంగా అసలే ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులు.. ఆన్​లైన్ తరగతులపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

సగం మంది గైర్హాజరు

అందుకే.. విజయవాడ నగరంలోని చాలా ప్రైవేటు పాఠశాలల్లో గతంలో ఒక తరగతికి 50మంది పిల్లలుంటే.. ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు ఆరంభించాక.. కనీసం 10 నుంచి 20 మంది కూడా ఉండడం లేదు. అవగాహన లేక ఉపాధ్యాయులు సైతం బోధించడానికి ఇబ్బందిపడుతున్నారు. దీనికితోడు ఇంటర్‌నెట్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్లు మరో ఇబ్బందిగా మారాయి. పాఠం చెబుతుండగా అకస్మాత్తుగా ఫోన్‌ తెరపై నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు కనిపించకుండా పోతున్నారు. తర్వాత లైన్‌లోనికి వచ్చి నెట్‌వర్క్‌ సమస్య అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ పాఠశాలలు ఉచితంగా దొరికే ఆన్‌లైన్‌ వీడియో యాప్‌లను వినియోగిస్తున్నారు. వీటిలో కొంత సమయం తర్వాత.. కనెక్షన్‌ కట్‌ అయిపోతుంది. డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే.. ఈ యాప్‌లు సుదీర్ఘ సమయం ఉండేందుకు అనుమతి ఇస్తాయి.

ఇబ్బంది పెడుతున్న నెట్ కనెక్షన్లు

ఉపాధ్యాయులతో బోధించి.. దానిని వీడియో తీసి విద్యార్థులకు పంపించాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే.. ఒక తరగతికి కనీసం 40నిమిషాల నుంచి గంట వీడియోను రూపొందించాల్సి ఉంటుంది. ఆ వీడియోను విద్యార్థులకు ఎలా పంపించాలనేది ప్రస్తుతం వారికి ఎదురవుతున్న సమస్య. వీళ్లు పంపించాక.. ఆ వీడియోను విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకుని చూసుకోవడం మరింత ఇబ్బంది. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు రోజుకు.. 2జీబీ, 3జీబీ ఉండే ఇంటర్‌నెట్‌ కనెక్షన్లు వాడుతున్నారు. పెద్ద పరిమాణంలో ఉన్న వీడియో ఫైల్‌ను పంపిస్తే.. వారికి డౌన్‌లోడ్‌ చేసుకోవడం కష్టం. చాలామంది తల్లిదండ్రులు ఇవన్నీ ఎందుకని, పాఠశాలలు ఎప్పుడు తెరిస్తే.. అప్పుడే పిల్లలను పంపిస్తామంటూ చెబుతున్నారు. అప్పటివరకూ ఓ 3, 4 నెలలు పాఠాలు పోయినా.. పర్వాలేదనే పంథాలో ఎక్కువ మంది తల్లిదండ్రులు ఉంటున్నారని విజయవాడలోని మరో ప్రైవేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వెల్లడించారు.

ఇవీ చదవండి..

ఇంజినీరింగ్ సీట్లలో కోత.. ఏఐసీటీఈ నిర్ణయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details