పదోతరగతి విద్యార్థులకు ఇంటి వద్దే ఆన్‌లైన్ క్లాసులు - online classes in ssc students
![పదోతరగతి విద్యార్థులకు ఇంటి వద్దే ఆన్‌లైన్ క్లాసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6701451-700-6701451-1586271849405.jpg)
19:11 April 07
పదోతరగతి విద్యార్థులకు ఇంటి వద్దే ఆన్‌లైన్ క్లాసులు
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల శిక్షణ కోసం అధికారుల ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు సిద్ధమయ్యేలా ఇంటి వద్దే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. రేపటి నుంచి దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా రోజూ పాఠ్యాంశాల బోధన చేయనున్నారు. డీడీ సప్తగిరి ఛానల్‌లో రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విద్యార్థులు ఫోన్ ద్వారా నిపుణులతో సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
ఇవీ చదవండి...'పాలు' తాగాడని కన్న కొడుకును చంపిన తండ్రి!