విజయవాడ కానూరు సిద్దార్ధ కళాశాల మైదానంలో.. ఒంగోలు ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆకర్షణీయమైన రూపం, గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన ఒంగోలు పశువులు.. ఆర్యుల కాలం నుంచే ఉన్నాయి. ఇతర జాతులతో పోలిస్తే వీటికి శారీరక సామర్థ్యం ఎక్కువ ఉండటం వల్ల.. ప్రతికూల వాతావరణాన్నీ తట్టుకోగలవు. యజమానుల పట్ల విధేయత, విశ్వాసం చూపడంలో వీటికవే సాటి..! అలాంటి ఒంగోలు జాతి ఎడ్లు, ఆవుల సంతతి అభివృద్ధి.. క్రమంగా క్షీణిస్తోంది. పోషణ భారమై.. అరుదైపోతున్న ఈ జాతి పరిరక్షణకు.. ఈ తరహా పోటీలు ఎంతో ఉపకరిస్తున్నాయి.
పశుపోషకుల్లో ఉత్సాహాం నింపేందుకు..
ఒంగోలు పశువుల పోటీల ద్వారా పశుపోషకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు.. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరావు నేతృత్వంలో.. గత కొన్నేళ్లుగా ఏటా ఈ పోటీలు జరుగుతున్నాయి. సుమారు వందకుపైగా ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొని.. నువ్వా- నేనా అన్నట్లుగా తలపడతాయి. గో సంరక్షణలో భాగంగా.. నేడు జరగబోయే గోపూజకు.. కర్ణాటకలోని ఆదిచుంచునగిరి మఠాధిపతి స్వామి నిర్మలానంద హాజరుకానున్నారు.
ఒంగోలు జాతికి పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్..