ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

almatti: ఆలమట్టికి కొనసాగుతున్న వరద.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం - ఆలమట్టి జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల వరద

మహారాష్ట్ర ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో అధిక ప్రవాహం కనిపిస్తోంది. ఆలమట్టి జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరడం వల్ల నీటి నిల్వ 80 టీఎంసీలకు చేరుకుంది.

Almatti Reservoir
ఆలమట్టికి కొనసాగుతున్న వరద

By

Published : Jun 23, 2021, 9:46 AM IST

ఎగువన కృష్ణానదిలో ప్రవాహం కొనసాగుతోంది. ఆలమట్టి జలాశయానికి 1.55 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 129. 72 టీఎంసీలకు మంగళవారం 80 టీఎంసీల స్థాయికి చేరుకుంది. నారాయణపూర్ జలాశయానికి 5,294 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జూరాలకు 2, 669 క్యూసెక్కులు ఉండగా... శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే ప్రవాహం పూర్తిగా పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం ఈ జలాశయం నుంచి నాగార్జున సాగర్ వైపు 7700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్​లోకి 9147 క్యూసెక్కులు వస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి అనంతరం 8536 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల జలాశయానికి 8927 క్యూసెక్కులు, తుంగభద్ర జలాశయానికి 36979 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది.

గోదావరి పరివాహకంలో కాళేశ్వరం ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బ్యారేజీ(మేడిగడ్డి)కి ప్రాణహిత, గోదావరి నదుల ద్వారా 17620 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఇక్కడ కన్నేపల్లి పంప్​హౌజ్ నుంచి అన్నారం సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎళ్లంపల్లి జలాశయానికి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి నంది, గాయత్రీ లిఫ్టుల ద్వారా వరద కాలువ నుంచి మధ్యమానేరుకు అక్కడ నుంచి దిగువమానేరుకు నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది.

ఇదీ చూడండి:

ఏపీలో ఘటన జరిగితే తెలంగాణకు వెళ్లి ఫిర్యాదు చేయాలా ? :హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details