శంషాబాద్ విమానాశ్రయంలో డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీ సరిచేస్తుండగా ఓ వ్యక్తి మృతి చెందాడు. విమానాశ్రయంలోని డ్రైనేజీ పైపులైన్ సరిగ్గా పని చేయకపోవటం వల్ల దాన్ని బాగు చేసేందుకు ముగ్గురు ప్లంబర్లు వచ్చారు. పైపులైన్‌ను సరిచేసేందుకు అందులో యాసిడ్ పోశారు.
తెలంగాణ: శంషాబాద్ విమానాశ్రయంలో డ్రైనేజీ పైప్ లీక్.. ఒకరు మృతి - డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీ
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీ ఘటన ఒకరిని పొట్టనబెట్టుకుంది. విమానాశ్రయంలో ఏర్పడిన డ్రైనేజీ పైప్‌లైన్ లీకేజీని సరిచేసేందుకు వచ్చిన ముగ్గురు ప్లంబర్లు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. ఒకరు మృతి చెందాడు.
తెలంగాణ : శంషాబాద్ విమానాశ్రయంలో డ్రైనేజీ పైప్ లీక్... ఒకరు మృతి
ఒక్కసారిగా ఘాటైన వాసన రావడం వల్ల.. రిపేరు చేస్తున్న నరసింహారెడ్డి (42)తో పాటు మరో ఇద్దరు సృహతప్పిపడిపోయారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అందులో నరసింహారెడ్డి మృతి చెందాడు. నరసింహారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి తెలిపారు.