Nara Devansh Birthday: తెలుగుదేశం అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు కానుకగా తితిదేలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే రూ.30 లక్షల వ్యయాన్ని చంద్రబాబు కుటుంబం విరాళంగా ఇస్తోంది.
ఈ ఏడాది విరాళంతో అన్నప్రసాదాలను వడ్డించాలని తితిదేను చంద్రబాబు కుటుంబం కోరింది. దీంతో నేడు తరిగొండ వెంగమాంబ నిత్యాప్రసాద భవనంలో 'టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్' అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.