ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. ఇందిరాగాందీ స్టేడియం నుంచి డి.వి మానర్ హోటల్ వరకు ఔత్సాహికులు పరుగు తీశారు. రన్లో మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ ఇంతియాజ్ , క్రీడాకారిణలు పీవీ.సింధు, జ్యోతి సురేఖ తదితరలు పాల్గొన్నారు. క్రీడాశాఖ మంత్రి అవంతి మాట్లాడుతూ...సీఎం జగన్‌కు క్రీడలంటే ప్రత్యేక అభిమానమని వ్యాఖ్యనించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. పిల్లల్లో శారీరక సామర్థ్యాలు లోపించడం వల్ల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
టోక్యో ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధిస్తా...
2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తానని బాడ్మింగ్టన్ స్టార్ క్రీడాకారిణి పీవీ.సింధు ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై దృష్టి పెట్టి రోజులో కనీసం ఒక గంటైనా వ్యాయామాలు చేయాలని సూచించారు.