విజయవాడ నగర శివారు కుందా వారి కండ్రికలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో దోపిడీ చేయడమే కాకుండా అడ్డువచ్చిన వృద్దురాలిని దారుణంగా హత్య చేశారు. ఇంటి ముందు కూర్చొని ఉన్న వృద్దురాలి సుబ్బమ్మపై ఆగంతకులు దాడి చేసి.. నగలు దోచుకెళ్లారు. తీవ్రగాయల పాలైన సుబ్బమ్మను ప్రైవేట్ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. సీసీఎస్, నున్న గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MURDER: రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..వృద్ధురాలి దారుణహత్య - విజయవాడలో చోరీ కేసు
కృష్ణా జిల్లాలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంటి ముందు కూర్చొని ఉన్న ఆమెను హతమార్చిన దుండగులు నగదు ఎత్తుకెళ్లారు.
old women murder in vijayawada
Last Updated : Aug 27, 2021, 10:17 AM IST