Old Woman at Vijayawada Bus Stand:అది నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ప్రాంతం. 24 గంటలు బస్సులు తిరుగుతూ...... రద్దీగా ఉండే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ట్ స్టేషన్. అక్కడే రోజులు తరబడి ఓ వృద్ధురాలు అచేతన స్థితిలో పడిపోయి ఉంది. అంతా చూస్తూ వెళ్తున్నారే తప్ప ఆమెను ఎవ్వరూ కనీసం పలకరించడం లేదు. చీమలు కుడుతున్నా, ఈగలు వాలుతున్న స్పందించే స్థితి లో ఆమె లేదు. కొన్ని రోజుల క్రితం 108 సిబ్బంది వచ్చి చూసిపోయారని అక్కడి ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. అయితే ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మనసున్న మారాజులు ఎవరైనా వృద్ధురాలికి చికిత్స చేయించి, స్వస్థలానికి పంపించాలని ఆటో డ్రైవర్లు కోరున్నారు.
Old Woman : కర్కశ కలియుగంలో మచ్చుకైనా కానరాని మానవత్వం..! - Old Woman at Vijayawada Bus Stand
Old Woman at Vijayawada Bus Stand: అది నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ప్రాంతం. 24 గంటలు బస్సులు తిరుగుతూ...... రద్దీగా ఉండే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ట్ స్టేషన్. అక్కడే రోజులు తరబడి ఓ వృద్ధురాలు అచేతన స్థితిలో పడిపోయి ఉంది. అంతా చూస్తూ వెళ్తున్నారే తప్ప ఆమెను ఎవ్వరూ కనీసం పలకరించడం లేదు.
Old Woman at Vijayawada Bus Stand