ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో జారిపడి మృతి చెందాడు. బ్యారేజీ కింద చేపల కోసం చూస్తుండగా... కాలుజారి నీటిలో పడి కొట్టుకుపోయాడు. కొద్దిసేపు ఈత కొట్టేందుకు ప్రయత్నించినా... ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు. చుట్టుపక్కల వారు కేకలు వేయగా... అక్కడే ఉన్న మత్స్యకారులు స్పందించి వృద్ధుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే నీళ్లు మింగేయటం వల్ల వృద్ధుడు అందరూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
నీళ్లలో జారిపడ్డాడు..కళ్లెదుటే ప్రాణాలొదిలాడు - Prakasam barrage
కృష్ణాజిల్లా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ వృద్ధుడు కృష్ణానదిలో జారిపడి మృతి చెందాడు. కొద్దిసేపు ఈత కొట్టేందుకు ప్రయత్నించినా... ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయాడు.
ప్రకాశం బ్యారేజీ వద్ద జారిపడి వృద్ధుడు మృతి