ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త జిల్లాలకు నోడల్ అధికారులుగా.. ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల నియామకం - ap new district news

Nodal Officers of New Districts in AP: కొత్త జిల్లాలకు నోడల్ అధికారులుగా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను నియమిస్తూ సర్కార్ ఆదేశారు జారీ చేసింది. శాశ్వత కేటాయిపులు చేసేంత వరకు ఉద్యోగుల సర్వీస్​ అంశంపై నోడల్ అధికారులు పర్యవేక్షణ చేస్తారని పేర్కొంది. ఈ మేరకు సీఎస్ సమీర్​ శర్మ​ ఉత్తర్వులు జారీ చేశారు.

Nodal Officers of New Districts in AP
కొత్త జిల్లాలకు నోడల్ అధికారులు

By

Published : Apr 7, 2022, 4:25 AM IST

కొత్త జిల్లాలకు నోడల్ అధికారులుగా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డర్​ టూ సర్వ్ ప్రాతిపదికన నియమించిన ఉద్యోగుల సర్వీస్ అంశాలు, పదోన్నతులు, తదితర అంశాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తూ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు.

పాలన అవసరాల రీత్యా కొత్త జిల్లాలకు ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించామని.. వీటిని ప్రొవిజినల్ నియామకాలుగానే పరిగణిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. శాశ్వత కేటాయిపులు చేసేంత వరకు నోడల్ అధికారులు.. ఉద్యోగుల సర్వీసు అంశాలపై పర్యవేక్షణ చేస్తారని ఉత్తర్వులో పేర్కొంది.

ఇదీ చదవండి:నేడు నరసరావుపేటలో సీఎం జగన్‌ పర్యటన.. వాలంటీర్లకు సన్మానం

ABOUT THE AUTHOR

...view details