ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cyber Crime: నకిలీ యాప్ సృష్టించి.. నగదు కాజేసి..

cyber crime: ఓలా స్కూటర్​కు మార్కెట్​లో ఉన్న డిమాండ్​ను సైబర్ నేరగాళ్ల ఆసరా చేసుకుని.. అమాయకుల నుంచి వేలు గుంజేస్తున్నారు. ఓలా పేరుతో నకిలీ యాప్​ను సృష్టించి.. స్కూటర్​ బుకింగ్ పేరిట డబ్బుులు వసూలు చేస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.39 వేలు కాజేశారు.

Ola fake app
Ola fake app

By

Published : Mar 13, 2022, 1:22 PM IST

cyber crime: ఓలా స్కూటర్​కు మార్కెట్​లో ఉన్న డిమాండ్ సైబర్ నేరగాళ్ల పాలిట వరంగా మారింది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయమంటూ ఏకంగా నకిలీ యాప్​నే సృష్టించి అమాయకుల నుంచి బుకింగ్, ఇన్సూరెన్స్ అంటూ వేలు గుంజేస్తున్నారు. విజయవాడకు చెందిన శివకూమార్ ఈ నకిలీ యాప్​లో పేరు నమోదు చేసుకొని దాదాపు రూ.39 వేల వరకూ డబ్బులు పొగొట్టుకున్నాడు.

యాప్ లోగో ఓలా కంపెనీకి సంబందించిన దానిలో ఉండటంతో మోసపోయినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details