తెలంగాణలోని యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆయిల్ ట్యాంకర్ చోరీకి గురైంది. శంషాబాద్‌లోని కాటేదాన్‌లో నివాసముంటున్న కట్టా రాంరెడ్డి... కుటుంబసభ్యులతో కలిసి ఆయిల్ ట్యాంకర్(AP13X6731)తో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వచ్చాడు. కొండకింద వైకుంఠ ద్వారం సమీపంలో వాహనాన్ని పార్క్ చేసి దర్శనం కోసం వెళ్లారు.
దైవదర్శనం ముగించుకు వచ్చే లోపే లారీ మాయం
కుటుంబసభ్యులతో కలిసి పూజ చేసుకునేందుకు... ఆయిల్ ట్యాంకర్‌తో ఆలయానికి వచ్చిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. దైవదర్శనం చేసుకుని వచ్చేసరికి.. జీవనాధారమైన లారీని ఎవరో అపహరించడంతో నిస్సహాయ స్థితిలో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రిలో జరిగింది.
దైవదర్శనం ముగించుకున్నాడు... లారీ పోయిందని లబోదిబోమన్నాడు
పూజ అనంతరం వచ్చి చూసే సరికి లారీ అక్కడ కనిపించలేదు. దీంతో కంగుతున్న రాంరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు జీవనాధరమైన లారీ చోరీకి గురికావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులను పట్టుకుని తమకు లారీని ఇప్పించాలని వేడుకున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ టీవీలు పరిశీలించి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు సుస్పష్టం: హైకోర్టు