ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 11, 2022, 9:34 PM IST

Updated : Feb 11, 2022, 10:34 PM IST

ETV Bharat / city

అశోక్‌బాబును సీఐడీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచిన పోలీసులు.. కాసేపట్లో నిర్ణయం

తప్పుడు ధ్రువపత్రాల కేసులో అరెస్టైన తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌ బాబును అధికారులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జడ్జి నివాస ప్రాంతంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు
ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ కోర్టులో హాజరుపరిచిన అధికారులు

తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్ బాబుని సీఐడీ పోలీసులు విజయవాడకు తరలించారు. గురువారం రాత్రి అరెస్ట్‌ చేసినప్పటి నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారించిన పోలీసులు.. కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్‌ అని నిర్ధరణ కావడంతో అశోక్ బాబుని విజయవాడ సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. అశోక్​బాబు ఆరోగ్యం బాగా లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఎమ్మెల్సీ అరెస్ట్​లో నిబంధనలు పాటించలేదన్నారు. అయితే అశోక్​బాబాకు సీఐడీ కోర్టు.. రిమాండ్​ విధిస్తుందా..? లేక బెయిల్ ఇస్తుందా అనే దానిపై కాసేపట్లో నిర్ణయం తెలపనుంది. మరోవైపు జడ్జి నివాస ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అశోక్‌ బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..

అశోక్‌బాబును అరెస్టు చేయటంపై హైకోర్టులో దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అశోక్‌బాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అశోక్‌బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

అశోక్ బాబు అరెస్ట్.. ఎందుకంటే..?

తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని నివాసం నుంచి రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన్ను తరలించారు. గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో మాటు వేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, వాహనంలో తరలించారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా, చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాన్ని సమర్పించారనీ, మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్‌కుమార్‌.. లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన లోకాయుక్త.. వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ డి.గీతామాధురి ఇటీవల అశోక్‌బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి

దొంగ డిగ్రీలు చదివిన మీరా.. దొంగ సర్టిఫికెట్ల గురించి మాట్లాడేది? - అయ్యన్నపాత్రుడు

Last Updated : Feb 11, 2022, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details