కొత్త పేస్కేళ్ల ప్రకారం జీతాలు చెల్లించాలని ప్రభుత్వం హడావిడి పడుతున్నా.. ఇప్పటికీ వేతనాల ప్రాసెసింగ్ ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. డీడీఓల నిరసనతో జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేసే బాధ్యతను డీడీఓల కంటే పైస్థాయి అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వివిధ జిల్లాల కలెక్టర్లు, హెచ్ఓడీలకు అంతర్గతంగా సర్క్యులర్ జారీ అయింది. జీతాల బిల్లులు ప్రాసెస్ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు.. నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జీతాల ప్రాసెసింగ్‌లో గందరగోళం.. కొత్త పీఆర్సీ జీతాలు వద్దంటున్న ఉద్యోగులు.. - కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల ప్రాససింగ్ లో అవాంతరాలు
20:17 January 30
TECHNICAL PROBLEMS IN PROCESSING SALARIES AS PER NEW PRC
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
సర్వీస్ రిజిస్టర్ లేక ఇక్కట్లు..
సర్వీస్ రిజిస్టర్ అందుబాటులో లేని కారణంగా జీతాల బిల్లులను చెల్లింపులు చేయలేమని అశక్తతను వ్యక్తం చేస్తూ కొన్ని జిల్లాల్లో ఉన్నతాధికారులు ట్రెజరీ అధికారులకు లేఖలు కూడా పంపారు. ప్రాసెస్ కాని బిల్లుల విషయంలో అధికారాలను బదలాయిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులిచ్చారు. అయితే.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దంటూ చాలా మంది ఉద్యోగులు రిక్వెస్ట్ లెటర్లు పెడుతున్నారన్న విషయాన్ని స్పష్టం చేస్తూ అధికారులు లేఖలు పంపుతున్నారు. కొన్ని చోట్ల ఆదివారం పూట కూడా కార్యాలయాలకు వచ్చి బిల్లులను ప్రాసెసింగ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. అవి సఫలం కానట్లు తెలుస్తోంది. సాంకేతిక ఇబ్బందుల కారణంగా బిల్లుల ప్రాసెసింగ్ ప్రక్రియ చాలా చోట్ల పూర్తి కాలేదని సమాచారం.
ఇదీ చదవండి:పోరాటానికి ప్రభుత్వ వైఖరే కారణం.. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మె: ఉద్యోగ సంఘాలు