తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తిపై తెదేపాకు చెందిన ఫేస్బుక్ పేజీలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసిన ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు నాగార్జున, అనిల్ కుమార్ నిందితులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోస్టులు పెట్టిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెదేపాకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే గురుమూర్తిని అవమానపరిచేలా పోస్టింగ్‌లు పెడుతున్నారని ఎంపీ సురేశ్ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.