Remand Prisoner Died: కృష్ణా జిల్లా నూజివీడు సబ్ జైలులో ఖైదీగా వచ్చిన వ్యక్తి.. వాంతులు, తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సంచలనం కలిగిస్తోంది. విజయవాడకు చెందిన భానుచందర్ అనే వ్యక్తి మద్యం కేసులో పట్టుబడగా.. నూజివీడు సబ్ జైలుకు తరలించారు.
Remand Prisoner Died: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి - కృష్ణా జిల్లా నేర వార్తలు
Remand Prisoner Died: కృష్ణా జిల్లా నూజివీడు సబ్ జైలుకు ఖైదీగా వెళ్లిన భానుచందర్.. తీవ్ర అనారోగ్యం కారణంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి
అయితే అకస్మాత్తుగా వాంతులు రావడంతో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. పూర్వం నుంచి ఉన్న మద్యం అలవాటే ప్రాణం తీసిందని సబ్ జైలు సూపరింటిండెంట్ ప్రసాద్ అన్నారు. అయితే ఖైదీగా వెళ్లిన భానుచందర్ మృతితో స్థానికంగా సంచలనం కలిగిస్తోంది.
ఇదీ చదవండి.. :SI SUICIDE AT KURNOOL: విషం తాగి ఎస్సై రాఘవరెడ్డి ఆత్మహత్య