మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా పోషక విలువలతో కూడిన అల్పాహారం, భోజనాన్ని ప్రజలకు అందించేందుకు వెల్ నెస్ బ్రాండ్ ఒక అడుగు ముందుకేసి విజయవాడలో ఓర్కా కేఫ్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటుడు ఠాకూర్ అనూప్ సింగ్ ఈ కేఫ్‌ను ప్రారంభించారు. ఇందులో కేకులు, కుకీస్, 14 రకాల టీలను అందిస్తున్నారు. బిర్యానీ నుంచి పిజ్జాల వరకు, పాస్తా మొదలు పేస్ట్రీల వరకు అన్ని రకాల పోషకాహార వంటలను అందిస్తున్నట్లు ఫ్రాంచైజీ యజమాని శ్రీ సాయి తెలిపారు.
విజయవాడలో పౌష్టికాహారానికి కేరాఫ్ అడ్రస్ ఓర్కా కేఫ్
ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. నోటికి రుచిగా ఉందా.. కడుపు నిండిందా అనే చూస్తున్నారు తప్ప అది ఎంత ఆరోగ్యమో ఆలోచించడం లేదు. దీనిపై ఆలోచించిన ఓ హోటల్ యాజమాన్యం పోషక విలువలున్న ఆహారాన్ని విక్రయిస్తోంది. మరి ఆ హోటల్ విశేషాలు మనమూ తెలుసుకుందామా..!
విజయవాడ ఓర్కా కేఫ్‌లో పోషకాహారపు భోజనం