ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

BORN BABY DIED: గర్భిణికి శస్త్రచికిత్స చేసి కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి.. - baby died in jeedimetla lions club hospital

BORN BABY DIED: తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్బిణికి.. వైద్యుడు లేకుండానే.. నర్సులు కాన్పు చేయడం కలకలం రేపింది.

గర్భిణికి శస్త్రచికిత్స చేసి కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి.
గర్భిణికి శస్త్రచికిత్స చేసి కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి.

By

Published : Jan 22, 2022, 1:59 PM IST

BORN BABY DIED: తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్బిణికి.. వైద్యుడు లేకుండానే.. నర్సులు కాన్పు చేయడం కలకలం రేపింది. అపురూప కాలనీకి చెందిన భార్గవి శుక్రవారం సాయంత్రం జీడిమెట్ల సబ్‌స్టేషన్‌ పరిధిలోని లయన్స్ క్లబ్ ఆస్పత్రిలో చేరారు. రాత్రి ఏడు గంటల తర్వాత నొప్పులు తీవ్రం కావడంతో డాక్టర్ అందుబాటులో లేకుండా పోయారు.

నర్సులు జోస్న, రాణి గర్బిణీని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారని బాధితురాలి భర్త ఆరోపించారు. సాధారణ ప్రసవం చేశారని.. బిడ్డ మృతి చెందాక.. స్థానిక ఆసుపత్రికి తరలించమని చెప్పారని వాపోయారు. న్యాయం చేయాలని బాధితులు లయన్స్ క్లబ్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details