ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటికి రాని వాలంటీర్లు... గడప దాటిన ప్రజలు

లాక్​డౌన్​ నేపథ్యంలో పేదల కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్​ కార్డు దారులకు రూ.1000 చొప్పున పంపిణీ చేస్తోంది. ఈ నగదును తీసుకోవడానికి విజయవాడలోని ఓ కాలనీ ప్రజలు కరోనాను లెక్కచేయకుండా సచివాలయం వద్ద గుమిగూడారు. వాలంటీర్లు నగదు పంపిణీ చేయకపోవటంతో వారు ప్రమాదకరంగా కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

number of People gathered vijayawada  for a thousand rupees
number of People gathered vijayawada for a thousand rupees

By

Published : Apr 4, 2020, 6:58 PM IST

ఇంటికి రాని వాలంటీర్లు... గడప దాటిన ప్రజలు

తెల్లరేషన్ కార్డులు కలిగిన వారికి ఆర్థిక సాయం కింద ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 1000 రూపాయల కోసం విజయవాడ నగరంలో పలువురు బారులు తీరారు. విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలోని వార్డు సచివాలయానికి నగదు కోసం తెల్లరేషన్ కార్డు దారులు క్యూ కట్టారు. ఉదయం ఓసారి నగదు కోసం నగర వాసులు భారీ ఎత్తున తరలిరాగా సర్వర్ పని చేయడం లేదని వార్డు సచివాలయం ఉద్యోగులు చెప్పారు. మధ్యాహ్నం మళ్లీ రావాలంటూ కూపన్లు ఇచ్చి తిప్పి పంపారు. వారు చెప్పిన సమయానికి మరోసారి మహిళలు పెద్ద ఎత్తున రాగా.... సచివాలయం మూసివేసి ఉంది. చేసేది లేక ఉద్యోగులు వచ్చే వరకు అక్కడే చెట్ల కింద ప్రజలు పడిగాపులు కాయాల్సి వచ్చింది. వాలంటీర్ల ద్వారా పలుచోట్ల ఇంటింటికీ నగదు పంపిణీ చేస్తున్నా....ఈ వార్డులో అలా లేకపోవటంతో కార్డుదారులు ఇలా సామాజిక దూరాన్ని సైతం పక్కన పెట్టి వెయ్యి రూపాయల కోసం ప్రమాదకరంగా బారులు తీరారు.

ABOUT THE AUTHOR

...view details