ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ, ప్రైవేట్ వైద్య కళాశాలల మధ్య వివాదం ముదురుతోంది. ఈ మేరకు వైద్య కళాశాలలకు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ నోటీసులు పంపారు. కన్వీనర్, యాజమాన్య కోటా విద్యార్థులను కౌన్సిలింగ్ ద్వారా చేర్చుకోకపోవడంపై నోటీసులు ఇచ్చారు. విద్యార్థులను ఈ నెల 8న చేర్చుకోకపోతే చర్యలు ఉంటాయని వర్సిటీ, కళాశాలలను హెచ్చరించింది.
ముదిరిన వివాదం.. ప్రైవేటు కళాశాలలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటీసులు - ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తాజా వార్తలు
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ, ప్రైవేట్ వైద్య కళాశాలల మధ్య వివాదం ముదురుతోంది. కన్వీనర్, యాజమాన్య కోటా విద్యార్థులను ఈ నెల 8న చేర్చుకోకపోతే చర్యలు ఉంటాయని వర్సిటీ, కళాశాలలను హెచ్చరించింది.
ప్రైవేటు కళాశాలలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటీసులు
వర్సిటీ లేఖపై స్పందించిన ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యం తిరిగి లేఖ రాసింది. విద్యార్థులను చేర్చుకునేది లేదని గతంలోనే లేఖ రాశామని.. ఇప్పుడూ అదే మాట మీద ఉంటామని తెలిపింది.
ఇవీ చదవండి... పథకాలు మావి... పేర్లు మీవా: ధూళిపాళ్ల నరేంద్ర
Last Updated : Jun 6, 2020, 4:53 PM IST