NTR varsity employees boycott duties from tomorrow: యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ఎన్టీఆర్ వర్శిటీ ఉద్యోగులు స్పష్టం చేశారు. అమరావతిలో ఎన్టీఆర్ వర్శిటీలో సమావేశమైన ఉద్యోగులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలు, విద్యార్ధి సంఘాలు జేఏసీగా ఏర్పడినట్లు తెలిపారు. అంతకుముందు వీసి, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా వర్శిటీ ప్రాంగణంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు.
fight for funds: యూనివర్శిటీ నిధుల మళ్లింపును నిరసిస్తూ.. విధులు బహిష్కరిస్తామని ప్రకటించిన ఉద్యోగులు.. ఏం చేసైనా సరే నిధులు కాపాడుకుంటామని తెలిపారు. అలాగే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌కు వర్సిటీ పరిణామాలపై నివేదిస్తామని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.