ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NTR Varsity Employees Protest: నిధుల బదిలీపై.. ఎన్టీఆర్ వర్సిటీ ఉద్యోగుల ఆందోళన - ఉద్యోగుల ఆందోళన వార్తలు

నిధుల బదిలీని నిరసిస్తూ.. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉద్యోగులు (NTR University Employees Protest over fund transfers) ఆందోళనకు దిగారు. వీసీ ఏకపక్షంగా రూ.400 కోట్లు బదిలీ చేశారని వారు ఆరోపించారు. నిధుల బదిలీ అంశంపై ఐకాసగా ఏర్పడి.. రేపట్నుంచి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఉద్యోగుల ఆందోళన
ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఉద్యోగుల ఆందోళన

By

Published : Nov 29, 2021, 10:06 PM IST

విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉద్యోగులు (NTR University Employees Protest over fund transfers news) ఆందోళనకు దిగారు. రూ.400 కోట్లను వీసీ ఏకపక్షంగా బదిలీ చేశారని వారు ఆరోపించారు. జీవో నెంబరు 25తో బ్యాంకుల్లోని డిపాజిట్లకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

ఈ మేరకు వీసీ ఛాంబర్​లో బైఠాయించి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కష్టపడి వర్సిటీకి రూ.448 కోట్ల నిధులను కూడబెట్టామని.., వాటిని ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్​లోకి బదిలీ కోరటం సరికాదన్నారు. ఐకాసగా ఏర్పడి రేపట్నుంచి ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details