ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NTR university funds: అప్పటిలోగా నిధులు రాకపోతే.. న్యాయపోరాటమే - funds

funds to apsfcl: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్ల డిపాజిట్లు ఒక్క సంతకంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ ఖాతాకు బదిలీ అయ్యాయి. అయితే ఎప్పుడు కావాలన్నా తిరిగి తీసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా ఇచ్చేస్తామంటూ ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ ముందుగానే రాతపూర్వకంగా అంగీకరించింది. విశ్వవిద్యాలయ అవసరాల కోసం రూ.175 కోట్లు వెంటనే కావాలంటూ డిసెంబరు 2న ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌కు లేఖ ఇచ్చారు. దానిపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. డిసెంబరు 23 నాటికి 21 రోజుల గడువు పూర్తవుతుంది. లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఐకాస నాయకులు స్పష్టం చేశారు.

NTR university funds
NTR university funds

By

Published : Dec 14, 2021, 8:04 AM IST

ntr varsity funds transfer to apsfcl: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి చెందిన రూ.400 కోట్ల డిపాజిట్లు ఒక్క సంతకంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ ఖాతాకు బదిలీ అయ్యాయి. అయితే ఎప్పుడు కావాలన్నా తిరిగి తీసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా ఇచ్చేస్తామంటూ ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ ముందుగానే రాతపూర్వకంగా అంగీకరించింది. తాజాగా గవర్నర్‌కు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ కె.శంకర్‌ ఇచ్చిన వాస్తవ నివేదికలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై ఎన్టీఆర్‌ వర్సిటీ ఉద్యోగ ఐకాస న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. విశ్వవిద్యాలయ అవసరాల కోసం రూ.175 కోట్లు వెంటనే కావాలంటూ డిసెంబరు 2న ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌కు లేఖ ఇచ్చారు. దానిపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. డిసెంబరు 23 నాటికి 21 రోజుల గడువు పూర్తవుతుంది. లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఐకాస నాయకులు స్పష్టం చేశారు.

వర్సిటీ నిధులను ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ ఖాతాకు నవంబరు 30న బదిలీ చేశారు. అదేరోజు ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో నాయకులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ గవర్నర్‌ ఆదేశించడంతో.. ఈనెల 6న వాస్తవ నివేదికను అందజేశారు. నిధుల డిపాజిట్‌కు సంబంధించి నవంబరు 9న తొలిసారి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం.. ఆ తర్వాత అదేనెల 30న రూ.400 కోట్లను బదిలీ చేయడం వరకు జరిగిన పరిణామాలన్నింటినీ అందులో వివరించారు. ‘మిగులు, అదనపు నిధులను ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌లో డిపాజిట్‌ చేయాలంటూ ప్రభుత్వం నుంచి వర్సిటీకి ఆదేశాలు అందాయి. నవంబరు 13న పాలకమండలి(ఈసీ), ఫైనాన్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి.. బ్యాంకులతోపాటు బిడ్డింగ్‌లో పాల్గొంటేనే ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌లో డిపాజిట్లు చేయాలని నిర్ణయించారు. నవంబరు 25న రాష్ట్ర ప్రభుత్వం జీవో 1998ను విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల మిగులు, అదనపు నిధులకు మరింత భద్రత కల్పించేందుకు, దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌లో డిపాజిట్‌ చేసుకోవాలని జీవోలో సూచించారు. ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయ డిపాజిట్లకు బ్యాంకులు ఇస్తున్న దానికంటే ఎక్కువగా 5.5% వడ్డీ ఇస్తామంటూ నవంబరు 26న ప్రకటించారు. ఇదే విషయంపై సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శితో చర్చించిన తర్వాత.. రూ.400 కోట్లను బదిలీ చేశాం’ అంటూ గవర్నర్‌కు రిజిస్ట్రార్‌ సమర్పించిన వాస్తవ నివేదికలో వివరించారు.

రూ.43 కోట్ల వడ్డీ రావాల్సి ఉండగా..

ఎన్టీఆర్‌ వర్సిటీకి చెందిన రూ.400 కోట్ల డిపాజిట్లను గడువు తీరకుండా బ్యాంకులో నుంచి తీసేయడంతో రూ.31 కోట్ల వడ్డీని వదులుకోవాల్సి వచ్చింది. ప్రతి డిపాజిట్‌కు వేర్వేరు కాలపరిమితులు ఉంటాయి. వీటిలో కొన్ని 2022 వరకు, మరికొన్ని 2023 వరకు ఉన్నాయి. వీటన్నింటి కాలపరిమితి తీరితే రూ.43 కోట్ల వడ్డీ రావాల్సి ఉంది. అర్ధంతరంగా తీసేయడంతో నవంబరు 30 వరకు రూ.12 కోట్ల వడ్డీ మాత్రమే వచ్చింది. బ్యాంకులో 5.1% వడ్డీ వస్తుండగా.. ఏపీఎస్‌ఎఫ్‌సీఎల్‌ 5.5% వడ్డీ ఇస్తానని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ఎంతవరకు నమ్మొచ్చనే విషయంలోనే ఉద్యోగ ఐకాస నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details