ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాలతో వరద ప్రాంతాల్లో ట్రస్ట్ సహాయక చర్యలు(NTR Trust Services at floods effected district) కొనసాగుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాలో వరదలతో నిరాశ్రయులైన ప్రజానీకానికి తాగునీరు, ఇతర ఆహార పదార్థాలను ఎన్టీఆర్ ట్రస్ట్(NTR TRUST CHAIRPERSON NARA BHUVANESHWARI) అందజేస్తుంది.
గత ఐదు రోజులుగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ.. వాళ్లు తమ ఉదారతను చాటుకుంటున్నారు.