కరోనా బాధితులకు సేవలందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య విభాగం సెల్ ఏర్పాటు చేసినట్లు తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో ఉన్నప్రముఖ వైద్యులు లోకేశ్వరరావు ఆధ్వర్యంలో... ఆన్‌లైన్‌లో వైద్యసాయం, సూచనలు అందిస్తున్నామని తెలిపింది.
ఇప్పటివరకు 592 మంది వైద్య సహాయం కోసం అభ్యర్థనలు పంపితే... 351మందికి సేవలందించామని తెలిపింది. మరో 98 మంది దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పింది. 80 మంది అభ్యర్ధనలు ప్రభుత్వానికి బదిలీ చేశామంది. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షానే తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని స్పష్టం చేసింది.