ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అనాథ మృతదేహాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు: నారా భువనేశ్వరి - NTR trust latest news

అనాథల మృతదేహాల అంత్యక్రియల నిర్వహణకు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించినట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. రాష్ట్రంలోని 4 ప్రధాన పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నట్లు తెలిపారు.

NTR trust decided to cremation of orphan dead bodies
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి

By

Published : May 29, 2021, 6:04 PM IST

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి నిర్ణయించారు. కరోనాతో మృతి చెందిన వారి శవాలను రోడ్లపై వదిలేయడం చూసి కలత చెందినట్లు భువనేశ్వరి వెల్లడించారు.

అలాంటి వారికి గౌరవప్రదంగా మృతుల చివరి మజిలీ సాగేలా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 4 ప్రధాన పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details