NTR 100TH Birth Anniversary: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో ఫిల్మ్‌నగర్ రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్‌గా నామకరణం చేయాలని సినీ ప్రముఖులు కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామరావు జయంతిని పురస్కరించుకుని.. ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో పాటు సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. అనంతరం 'ఎన్టీఆర్' పుస్తకాన్ని దగ్గుబాటి పురందేశ్వరి, పరిటాల సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఫిల్మ్ నగర్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం లేకపోవడం బాధ కలిగించేదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. వందేళ్ల తర్వాత అయినా ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం ఆనందంగా ఉందనన్నారు. ఫిల్మ్ నగర్ రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్ పేరు పెట్టేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
'ఆయన కారణంగా రాజకీయంగా, సినిమా రంగంలో ఎంతో మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎన్టీఆరే శ్రీకారం చుట్టారు. -మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే