ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఐదు రోజుల్లో వైద్య విద్య ప్రవేశ ప్రక్రియకు అభ్యర్థుల మెరిట్ లిస్టు' - 2020 ఎంబీబీఎస్ కౌన్సిలెంగ్ తాజా వార్తలు

ఈ విద్యా సంవత్సరానికి వైద్య విద్య ప్రవేశ ప్రక్రియకు అభ్యర్థుల మెరిట్ లిస్టును ఐదు రోజుల్లోపు తయారు చేస్తామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతి డాక్టర్.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. డిసెంబరు 15వ తేదీలోపు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి 16 నుంచి కళాశాలలను ప్రారంభించాల్సి ఉందని..,ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలల ప్రారంభం మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయన్నారు.

ఐదు రోజుల్లో వైద్య విద్య ప్రవేశ ప్రక్రియకు అభ్యర్థుల మెరిట్ లిస్టు
ఐదు రోజుల్లో వైద్య విద్య ప్రవేశ ప్రక్రియకు అభ్యర్థుల మెరిట్ లిస్టు

By

Published : Nov 25, 2020, 9:02 PM IST

2020 - 21 విద్యా సంవత్సరానికి వైద్య విద్య ప్రవేశ ప్రక్రియకు అభ్యర్థుల మెరిట్ లిస్టును ఐదు రోజుల్లోపు తయారు చేస్తామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతి డాక్టర్.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో చేరేందుకు 13,300 దరఖాస్తులు వచ్చాయన్నారు. వచ్చే మంగళవారంలోపు మెరిట్ లిస్టు విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలకు రెండు రోజుల గడువిస్తామన్నారు. అనంతరం తుది మెరిట్ లిస్టు ఇచ్చి విద్యార్థులకు ఆన్​లైన్​లోనే కాలేజీలను కేటాయిస్తామన్నారు. డిసెంబరు 15వ తేదీలోపు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి 16 నుంచి కళాశాలలను ప్రారంభించాల్సి ఉందని..,ప్రస్తుత పరిస్థితుల్లో కళాశాలల ప్రారంభం మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మరో జీవో చేయాల్సి ఉందని వీసీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details