2020-21 విద్యా సంవత్సరం వైద్య విద్యలో ప్రవేశం పొందేందుకు మొదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు విడుదల చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈనెల 10న ఉదయం 8 నుంచి 13న రాత్రి 8 వరకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. అభ్యర్ధులు ఒకేసారి ఆప్షన్స్‌ను నిర్ణయించుకోవాలని సూచించారు. మొదటిసారి పొందుపరిచిన కళాశాలల ఆప్షన్స్ ఆధారంగానే తొలి, మలి విడత, మాప్ అప్ కౌన్సెలింగ్‌లు జరుగుతాయని అధికారులు తెలిపారు.
వైద్య విద్య మొదటి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల - ప్రవేశాలకు ఎన్టీఆర్ వర్సిటీ నోటిఫికేషన్
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలకు మెుదటి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో...అధికారులు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఆప్షన్లు ఇవ్వాలని అధికారులు సూచించారు.
వైద్య విద్య మొదటి కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల