ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్య ప్రవేశాలకు సీట్‌ మ్యాట్రిక్స్‌ విడుదల - వైద్య కళాశాలల వార్తలు

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేద, హోమియో సీట్ల ప్రవేశానికి మెరిట్‌ లిస్ట్‌ను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియను వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.

NTR Health University has released the merit list for admission to MBBS seats
ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశానికి మెరిట్‌ లిస్ట్‌ విడుదల

By

Published : Dec 8, 2020, 9:21 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించిన తుది ప్రాధాన్యత క్రమాన్ని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటికే అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను వెల్లడించింది. గతంలో విడుదల చేసిన ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టులో ఉన్న 13,089 మంది అభ్యర్థులతో పాటు మరో తొమ్మిది మంది తుది జాబితాకు అర్హత సాధించారు. దీంతో పాటు సీట్‌మ్యాట్రిక్స్‌ను విశ్వవిద్యాలయం ప్రకటించింది. వైద్య విద్యా సంచాలకుడితో చర్చించిన తర్వాత కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల తేదీలను ప్రకటిస్తామని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details