జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాల్లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల జాబితాను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. రాష్ట్రం నుంచి మొత్తం 43,977మంది పరీక్షలకు హాజరుకాగా 35,270 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా 13,66,945మంది నీట్‌కు హాజరుకాగా 7,71,500మంది అర్హత సాధించినట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. 29 వైద్య కళాశాలల్లో 5010 ఎంబీబీఎస్ సీట్లు, 16 దంత వైద్య కళాశాలలో 1440 దంత వైద్య సీట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. 113 మార్కులకు కటాఫ్ పెట్టినట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు.