ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూజిలాండ్​లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. పాల్గొననున్న చంద్రబాబు - mahanadu news

న్యూజిలాండ్​లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూం ద్వారా పాల్గొంటారని న్యూజిలాండ్ తెదేపా ఫోరం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు.

ntr birth anniversary at newzeland
న్యూజిలాండ్​లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

By

Published : May 26, 2021, 5:53 PM IST

తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే మహానాడుకు ప్రవాసాంధ్రులు కూడా సిద్ధమవుతున్నారు. న్యూజిలాండ్​లో నివసిస్తున్న తెదేపా అభిమానులు మహానాడుతో పాటు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30న ఆక్లాండ్​ నగరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు న్యూజిలాండ్ తెదేపా ఫోరం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. న్యూజిలాండ్​లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెదేపా అభిమానులు ఇందులో పాల్గొననున్నారు.

తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూం మీటింగ్ ద్వారా.. ఈ వేడుకల్లో పాల్గొంటారని తెదేపా ఫోరం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. ప్రతిఏటా మహానాడు, ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేవాళ్లమని..ఈసారి కరోనా దృష్ట్యా నిరాడంబరంగా చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. వేడుకలకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు చేపట్టే కరోనా నివారణ చర్యలకు ఈ నిధులు ఉపకరిస్తాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details