ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చికాగో నుంచి విజయవాడకు చేరుకున్న ఎన్​ఆర్​ఐలు - విజయవాడకు చేరుకున్న ఎన్​ఆర్​ఐలు న్యూస్

అమెరికా నుంచి రాష్ట్రవాసులు విజయవాడకు చేరుకున్నారు. వారికి వైద్య పరీక్షలు చేసి అధికారులు క్వారంటైన్​కు తరలించారు.

NRIs reached to vijayawada
NRIs reached to vijayawada

By

Published : May 17, 2020, 3:46 PM IST

Updated : May 17, 2020, 4:21 PM IST

చికాగో నుంచి ఉదయం హైదరాబాద్‌కు 31 మంది తెలుగువారు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో విజయవాడకు వచ్చారు. వారికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు. 31 మందికి వైద్య పరీక్షలు చేసి క్వారంటైన్‌కు తరలించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.

  • ప్రవాసాంధ్రుల్లో ..

కృష్ణా-ఏడుగురు, తూర్పుగోదావరి-ఐదుగురు, కర్నూలు-నలుగురు, ప్రకాశం-నలుగురు, చిత్తూరు-ముగ్గురు, పశ్చిమగోదావరి-3, నెల్లూరు-2, కడప, అనంతపురం, గుంటూరు నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉన్నారు.

వలస కూలీలను రైలులో అసోం, మణిపూర్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. దిల్లీ, చెన్నై నుంచి వచ్చిన వారిని జిల్లాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Last Updated : May 17, 2020, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details